ఐపీఎస్ కు సెలెక్ట్ అయిన వారికి కొన్ని నెలల పాటు ట్రెయినింగ్ ఇచ్చి ఆ తరువాత పోస్టింగ్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ట్రెయినింగ్‌లో భాగంగా జాయిన్ అవగానే జుట్టును చిన్నగా కట్ చేయిస్తారు. మనం సినిమాల్లో చూసినట్లుగానే నిజంగానే ట్రెయినింగ్ సమయంలో పోలీస్ అధికారులకు జుట్టును చిన్నగా కత్తిరిస్తారు. అయితే ఇలా ఎందుకు చేస్తారు ? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి ? అంటే…
* ఐపీఎస్ ట్రెయినింగ్‌లో అభ్యర్థులందరూ నిత్యం ఉదయాన్నే 5.15 గంటలకు నిద్ర లేవాలి. అప్పటి నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ట్రెయినింగ్ నిరంతరాయంగా కొనసాగుతుంది. మధ్యలో 2 నుంచి 3 గంటల వరకు గ్యాప్ ఇస్తారు.
* ట్రెయినింగ్ సమయంలో అనేక కఠినమైన టాస్క్‌లను ఇస్తారు. నేలపై పాకాల్సి ఉంటుంది. తాళ్లు పట్టుకుని ఎక్కాలి. వేలాడాలి. జంప్ చేయాలి. దొర్లాలి. ఇలా అనేక రకాల టాస్క్‌లను పూర్తి చేయాలి. అయితే జుట్టు పొడవుగా ఉంటే అలాంటి టాస్క్‌లు చేసే సమయంలో గాయాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే జుట్టును చిన్నగా కత్తిరిస్తారు.
* యూనిఫాం వల్ల అందరూ ఒకటే, వారి మధ్య కుల, మత, వర్గ విభేదాలు ఉండవు.. అని ఎలాగైతే భావిస్తారో అలాగే చిన్న హెయిర్ కట్ ఉండడం వల్ల కూడా అందరూ ఒకటేనన్న భావం ఏర్పడుతుంది. అందరూ ఐక్యంగా ఉండేందుకు అది దోహదపడుతుంది.
* సాధారణంగా జుట్టును ఫ్యాషన్ గా కనిపించేలా కట్ చేయించుకోవాలంటే అందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అదే షార్ట్ హెయిర్ కట్ అయితే పెద్దగా సమయం పట్టదు. కనుక సమయాన్ని ఆదా చేయడం కోసం కూడా ఇలా హెయిర్ కట్‌ను చిన్నగా ఉండేలా చేయించుకుంటారు.
* పోలీస్ ట్రెయినింగ్ అన్నాక అక్కడ మనం మనకు నచ్చినట్లు ఉండవచ్చు అంటే కుదరదు, ట్రెయినింగ్ కఠినంగా ఉంటుంది. కఠినతరమైన రూల్స్ ను పాటించాలి. కనుక ఆ రూల్స్ లో ఒకటైన చిన్న హెయిర్ కట్ అనే రూల్‌ను కూడా పాటించాల్సి ఉంటుంది.
* ట్రెయినింగ్‌లో జాయిన్ అవగానే ముందుగా జుట్టును చిన్నగా కట్ చేయిస్తారు. అంటే ముందు ముందు అలాంటి కఠినమైన టాస్క్‌లు ఇంకా ఎన్నో ఎదురవుతాయి, దేనికైనా సిద్ధంగా ఉండాలి, దేన్నయినా త్యాగం చేయాలి.. అని అభ్యర్థులకు ముందుగానే తెలియజేయడం కోసమే అలా ముందుగా జుట్టును చిన్నగా కట్ చేయిస్తారు. అందువల్లే ఐపీఎస్ మాత్రమే కాదు, ఇతర ఇలాంటి ఏ ట్రెయినింగ్ అయినా సరే.. అభ్యర్థులకు ముందుగా జుట్టును చిన్నగా కట్ చేయిస్తారు. ఇవీ.. దాని వెనుక ఉన్న అసలు విషయాలు..!