You are here
Home > viral

దాంప‌త్య స‌మ‌స్య‌ల‌ను తొల‌గించే 5 వాస్తు టిప్స్‌..!

మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్‌.. అంటే.. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణ‌యింప‌బ‌డ‌తాయి.. అని అర్థం.. పెళ్లి అనేది  ఇద్ద‌రు వ్య‌క్తుల శ‌రీరాల‌నే కాదు, మ‌న‌స్సుల‌ను కూడా క‌లుపుతుంది. రెండు కుటుంబాలు ద‌గ్గ‌ర‌వుతాయి. ఇక కూతురైనా, కుమారుడైనా త‌ల్లిదండ్రుల‌కు త‌మ పిల్ల‌ల పెళ్లి జ‌రుగుతుంటే క‌లిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఈ క్ర‌మంలోనే నూత‌న దంప‌తుల‌కు ఒక‌రిపై ఒక‌రికి బాధ్య‌త‌లు ఏర్ప‌డ‌తాయి. కొత్త‌గా సంసార జీవితం ప్రారంభ‌మ‌వుతుంది. అయితే అంతా అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌దు క‌దా.. కొన్ని జంట‌లు ప‌లు స‌మ‌స్య‌ల వ‌ల్ల ఎప్పుడూ ఇబ్బందులు ప‌డుతుంటాయి. ఎప్పుడూ కొంద‌రు దంప‌తులు గొడ‌వ‌లు ప‌డుతూ ఉంటారు. వారి సంసార జీవితం అంత స‌జావుగా సాగ‌దు. కానీ కింద తెలిపిన ప‌లు వాస్తు సూచ‌న‌లు పాటిస్తే దాంతో దంప‌తుల మ‌ధ్య ఉండే దాంప‌త్య స‌మ‌స్య‌లు పోయి వారి కాపురం హాయిగా సాగుతుంది. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఆగ్నేయ దిక్కున ఉన్న బెడ్‌రూంలో దంప‌తులు నిద్రించ‌రాదు. నిద్రిస్తే స‌మ‌స్య‌లు వస్తాయి. స‌మ‌స్య‌లు పోవాలంటే ఆ దిక్కున ఉన్న బెడ్‌రూంలో నిద్రించ‌రాదు.
2. ఆగ్నేయ దిక్కులాగే ఈశాన్య దిక్కులో ఉన్న బెడ్‌రూంలో కూడా దంప‌తులు నిద్రించ‌రాదు. స‌మ‌స్య‌లు పోవాలంటే ఈ దిక్కున ఉన్న బెడ్‌రూంలో నిద్రించ‌డం మానేయాలి.
3. ఇంట్లో ఈశాన్య దిశ‌లో కిచెన్ ఉండ‌రాదు. ఆ దిశ‌లో కిచెన్ ఉండ‌కుండా చూసుకుంటే దంప‌తుల మ‌ధ్య ఉండే గొడ‌వ‌లు త‌గ్గుతాయి.
4. ఇండ్ల‌లో ముళ్లు క‌లిగిన మొక్క‌ల‌ను, బొన్సాయ్ మొక్క‌ల‌ను పెంచ‌రాదు. అవి వాస్తు ప‌రంగా దోషాల‌ను కలిగించి దాంప‌త్య స‌మ‌స్య‌ల‌ను పెంచుతాయ‌ట‌. క‌నుక ఈ త‌ర‌హా మొక్క‌ల‌ను ఇండ్ల‌లో పెంచుకోకూడ‌దు.
5. బెడ్‌రూం గోడ‌లకు లైట్ క‌ల‌ర్ పెయింటింగ్ మాత్ర‌మే ఉండాలి. డార్క్ క‌ల‌ర్ పెయింటింగ్ ఉండ‌రాదు.
ఈ సూచ‌న‌లు పాటిస్తే దాంప‌త్య స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ని వాస్తు చెబుతోంది..!

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top