You are here
Home > viral

చ‌నిపోయే ముందు న‌వ్వుతూ సెల్ఫీ వీడియో….జీవితం గురించి ఎంత బాగా చెప్పిందో…..ఈ మాట‌లు వినండి!

‘నా పేరు అయేషా.. ఈ జీవితం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నాన్నా.. మ‌నం ఇంకెంత కాలం పోరాడుదాం….. నేను పోరాటం కోసం పుట్టలేదు. ఆరిఫ్ ( భ‌ర్త‌) కు స్వేచ్ఛ కావాలట….స‌రే అదే ఇచ్చేద్దాం! నాకేం బాధ లేదు. నేను సంతోషంగా ఉన్నా.. దేవుడిని కలవబోతున్నా….. నాకు మంచి తల్లిదండ్రులు దొరికారు… మంచి స్నేహితులు దొరికారు. దేవుడు ఇచ్చిన ఈ అందమైన జీవితాన్ని సంతోషంగా అనుభవించాలి. కానీ, కొన్ని ఆశించినట్లు జ‌ర‌గ‌వు….. నాకు స్వర్గం కూడా దొరుకుతుందో, లేదో.. చలో.. అల్విదా’’ అంటూ అయేషా అనే ఓ వివాహిత సెల్ఫీ వీడియో తీసుకొని సబర్మతీ నదిలో దూకి మ‌ర‌ణించింది.

అయేషా ప్రాబ్ల‌మ్ ఏంటి?
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన అయేషా కు రాజ‌స్థాన్ జాలోర్‌కు చెందిన ఆరిఫ్‌ ఖాన్‌తో 2018లో పెళ్లైంది. పెళ్లి త‌ర్వాత అధ‌న‌పు క‌ట్నం కోసం ఆరిఫ్ టార్చ‌ర్ స్టార్ట్ అయ్యింది. అప్ప‌టికే అనేక‌సార్లు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసినా ఇరుకుటుంబాల మ‌ధ్య చాలా గొడ‌వ‌ల‌య్యాయి…. అయేషా మిష‌న్ కుట్టి కొద్దో గొప్ప సంపాధించేంది అయినా సంతృప్తి చెంద‌ని ఆరిఫ్ అలాగే వేధించేవాడు….ఇక క‌ష్టాల‌ను త‌ట్టుకోలేని అయేషా ఇలా సెల్ఫీ వీడియో చేసి స‌బ‌ర్మ‌తి న‌దిలో దూకింది.

చాలా సేపు గాలించాక‌…అయేషా మృత‌దేహం దొరికింది. వీడియో ఆధారంగా అయేషా భ‌ర్త ఆరిఫ్ పై పోలీసుల‌కు పిర్యాదు చేశారు అయేషా కుటుంబ స‌భ్యులు. జీవితంపై ఇంత క్లారిటీ ఉన్న ఆమె….అదే ధైర్యంతో అదే చిరున‌వ్వుతో బ‌తికి ఉంటే ఇంకా బాగుండేది. పాపం

Watch Video :

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top