You are here
Home > viral

98 ఏళ్ళ వయసులో కూడా బఠానిలు అమ్ముతూ జీవిస్తున్న తాతగారు!!

ఆస్తులు ఉన్న వాళ్ళు వృద్దాప్యం వచ్చిన తర్వాత కష్టపడే అవసరం ఉండదు. ఇంట్లో కాళీగా ఉండలేని చాలా మంది పనులు చేస్తూ ఉంటారు. కాని బ్రతకడానికి డబ్బులు అవసరం అయిన వాళ్ళు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఒక విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర రాజధాని లక్నోకు 79 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలిలో 98 ఏళ్ల ఒక వృద్దుడు ఈ వయసులో కూడా తన కాళ్ళ మీద తాను బ్రతుకుతున్నాడు.

98 years old man

దీనితో వృద్దుడు ఆ వయసులో స్వతంత్రంగా బ్రతుకున్నందుకు జిల్లా యంత్రాంగం సత్కరించింది. విజయ్ పాల్ సింగ్ రాబయ్ రేలి దగ్గరలోని ఒక గ్రామంలో ఉడికించిన బఠానీలను విక్రయిస్తూ బ్రతుకుతున్నారు. ఒక రహదారి ప్రక్కన ప్లాట్‌ఫాం పై నిలబడి వాటిని విక్రయిస్తున్నాడు. ఒక వ్యక్తి దీనికి సంబంధించిన వీడియో రికార్డ్ చేసాడు. ఆ సమయంలో బఠానిని తయారు చేస్తూ చాలా సీరియస్ గా ఉన్నారు.

కొన్ని ప్రశ్నలు వేయగా నా కుటుంబం చాలా పెద్దది అని చెప్పుకొచ్చాడు. ఈ వయసులో ఎందుకు కష్టపడుతున్నారని అడగగా నాకు ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేదని అది నా బలహీనత అవుతుందని అందుకే తాను ఇలా కష్టపడుతున్నా అని వివరించాడు. ఆయనను గురువారం జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి ఆహ్వానించి ₹ 11,000 నగదు బహుమతి అందించారు. ఆయనకు వాకింగ్ స్టిక్, శాలువ, సర్టిఫికేట్ కూడా రాబరేలి జిల్లా మేజిస్ట్రేట్ వైభవ్ శ్రీవాస్తవ అందించారు. ప్రభుత్వ పథకం కింద సీనియర్ సిటిజన్‌కు ఇల్లు వచ్చిందని ఆయన వివరించారు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top