You are here
Home > viral

అరటి రైతులకు బిగ్ గుడ్ న్యూస్… యూరప్ దేశాలు ఆశగా చూస్తున్నాయా…?

మన దేశంలో వ్యవసాయ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షినాది రాష్ట్రాల్లో వ్యవసాయానికి చాలా మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఇప్పుడు కేరళలో పండే “నేంద్రన్” రకం అరటి పండ్లకు ఇప్పుడు యూరప్ దేశాల్లో డిమాండ్ పెరిగింది. అరటిపండ్లను యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయడానికి ఒక ప్రోటోకాల్ కూడా తయారు చేసారు. మువత్తుపుళలోని ప్రభుత్వ రంగ సంస్థ… నాదుక్కర ప్యాక్ హౌస్ లో ప్రతి సంవత్సరం కనీసం 2 వేల టన్నుల నేంద్రన్ అరటిని ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Banana-farmers

ఈ అరటిపండ్లు సాంప్రదాయకంగా ముందు నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతాయని అక్కడి అధికారులు చెప్పారు. అయితే లాటిన్ అమెరికన్ దేశాల వంటి సాంప్రదాయ సరఫరాదారుల నుండి సరఫరా కొరత ఎక్కువగా ఉండటంతో యూరోపియన్ యూనియన్ కు వీటిని సరఫరా చేస్తున్నట్టు అధికారులు వివరించారు. భారతీయ అరటి ఉత్పత్తిదారులకు మరియు ఎగుమతిదారులకు భారీ మార్కెట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

దీని ద్వారా రైతులకు మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అధికారులు వివరించారు. సప్లై చైన్ ని ప్రపంచ వ్యాప్తంగా అనుసంధానించడం ద్వారా కేరళ రైతులకు మేలు కలుగుతుంది అని చెప్పుకొచ్చారు. లాజిస్టిక్స్ వ్యయం తగ్గిందని… వాయు రవాణా ఖర్చులో 1/7 వ వంతు సముద్ర మార్గం ద్వారా తగ్గిందని… రైతుల ఆదాయాన్ని 20% పెంచుతుందని భావిస్తున్నారు.

అయితే ఈ డిమాండ్ ఎప్పటికప్పుడు పెరగడంతో ఒక ప్రోటో కాల్ ని రెడీ చేసారు. దాని కోసం ఒక ప్రోగ్రామ్ మరియు ఆపరేషన్ పాలసీలు మరియు విధానాలు ( POPP) మోడ్‌ను ఏర్పాటు చేసారు. ఈ వెంచర్ 2020 మేలో ప్రారంభమైందని అక్కడి అధికారులు చెప్పారు. త్రిస్సూర్ జిల్లాలో రైతులను ఎంపిక చేశారు. ట్రిచీలోని అరటిపండ్ల నేషనల్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసిన పద్ధతులకు సంబంధించి ఎగుమతి-ఆధారిత ప్యాకేజీ, సాంకేతిక భాగస్వామి ద్వారా రైతులకు శిక్షణ ఇస్తున్నారు

సుమారు 10 టన్నుల అరటిని లండన్ కు రవాణా చేయడానికి టార్గెట్ గా పెట్టారు. ఫిబ్రవరి 27 నుంచి ఈ కార్యక్రమం మొదలయింది. లండన్ గేట్‌వే పోర్టుకు అవసరమైన పోర్ట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వీటిని రవాణా చేస్తారు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top