You are here
Home > viral

ఫేస్‌బుక్ CEO మార్క్ జుకెర్‌బ‌ర్గ్ త‌న ల్యాప్‌టాప్‌ కెమెరాకు టేప్ వేశారు. ఎందుకంటే..?

ఇంట‌ర్నెట్ ప్ర‌పంచంలో నెటిజ‌న్లు ఎంత సుర‌క్షితంగా ఉందామ‌ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ హ్యాక‌ర్లు ఏదో ఒక విధంగా వారి డేటాను చోరీ చేస్తూనే ఉన్నారు. ఆ డేటా స‌హాయంతో నెటిజ‌న్ల‌ను బ్లాక్ మెయిల్ చేయ‌డం లేదా దాన్ని ఇత‌రుల‌కు అమ్ముకోవ‌డం లేదా ఇత‌ర స్వ‌ప్ర‌యోజ‌నాల‌కు ఆ డేటాను వాడ‌డం వంటివి చేస్తున్నారు. దీంతో స‌గ‌టు నెటిజ‌న్ ఇంట‌ర్నెట్ ప్ర‌పంచంలో సుర‌క్షితంగా ఉండ‌డం క‌ష్ట‌త‌ర‌మైంది. అయితే ల్యాప్‌టాప్‌ల‌ను ఎక్కువ‌గా వాడేవారు మాత్రం ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకెర్ బ‌ర్గ్ చేసిన‌ట్లు చేయాలి. ఇంత‌కీ ఆయ‌న ఏం చేశారంటే..?

చిత్రంలో చూశారు క‌దా. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ త‌న ల్యాప్‌టాప్ వెబ్ కెమెరాకు, మైక్రోఫోన్‌కు టేప్ వేశారు. అవును.. క‌రెక్టే. ఇంట‌ర్నెట్ ప్ర‌పంచంలో ల్యాప్‌టాప్‌ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించేవారు ఈ విధంగా చేస్తే కొంత వ‌రకు హ్యాక‌ర్ల నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. ఎందుకంటే.. నిత్యం మ‌నం ల్యాప్‌టాప్‌లో అనేక వెబ్‌సైట్ల‌ను సంద‌ర్శిస్తుంటాం. మ‌నం అనుమానాస్ప‌ద లింక్ క‌నిపిస్తే క్లిక్ చేయం. కానీ కొన్ని సార్లు పొర‌పాటుగా కూడా అలాంటి లింక్‌ల‌ను క్లిక్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. దీంతో ఆ లింక్ వ‌ల్ల మ‌న ల్యాప్‌టాప్‌లోకి మ‌న‌కు తెలియ‌కుండానే మాల్‌వేర్లు, స్పైవేర్లు ప్ర‌వేశిస్తాయి. అవి మ‌న డేటాను చోరీ చేసి హ్యాక‌ర్లకు చేర‌వేస్తాయి.

ఇక ఆ మాల్‌వేర్లు, స్పైవేర్లు అంత‌టితో ఆగ‌వు. మ‌న ల్యాప్‌టాప్ వెబ్ కెమెరా, మైక్‌ల‌ను యాక్సెస్ చేస్తాయి. మ‌నం వాటి ఎదుట కూర్చుని ప‌నిచేస్తాం క‌నుక మ‌న చుట్టూ వినిపించే శ‌బ్దాల‌ను ఆ వేర్లు రికార్డు చేస్తాయి. అలాగే మన ఫొటోలు, వీడియోల‌ను చిత్రీక‌రిస్తాయి. వాటిని కూడా మ‌న‌కు తెలియకుండానే హ్యాక‌ర్ల‌కు అవి చేరవేస్తాయి. దీంతో మ‌నల్ని వారు బ్లాక్ మెయిల్ చేయ‌వ‌చ్చు. లేదా ఆ డేటాను పైన తెలిపిన విధంగా ఉప‌యోగించ‌వ‌చ్చు. అందుక‌నే మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ అలా జ‌ర‌గ‌కుండా ఉండాల‌ని చెప్పి త‌న ల్యాప్‌టాప్ కెమెరా, మైక్‌ల‌కు అలా టేప్ వేశారు.

అయితే ప్రైవ‌సీ ప‌ట్ల అంత‌గా ప‌ట్టింపు లేని వారు, ఏమీ కాదులే అనుకునే వారు.. ల్యాప్‌టాప్ కెమెరా, మైక్‌ల‌కు అలా టేప్‌ల‌ను వేయాల్సిన ప‌నిలేదు. మామూలుగానే వాటిని ఉప‌యోగించుకోవ‌చ్చు. కానీ ప్రైవ‌సీ, భ‌ద్ర‌త‌ల‌పై ప‌ట్టింపు ఉన్న‌వారు పైన చెప్పిన విధంగా టేప్ వేసి ల్యాప్‌టాప్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. దీంతో ఇంట‌ర్నెట్ ప్ర‌పంచంలో హ్యాక‌ర్ల నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top