ఊరిపేరే ఇంటిపేరుగా గలవారు చాలామందే ఉంటారు. అలాగే కొంతమంది నటులకు లైఫ్ ఇచ్చిన వారి సినిమాలే వారి ఇంటిపేర్లుగా, వారి గుర్తింపు చిహ్నాలుగా మారిపోతాయి. అలా చాలా మంది నటీనటులే ఉన్నారు….వారెవరో ఇప్పుడు చూద్దాం!
షావుకారు జానకి:
1949 లో షావుకారు అనే సినిమా ద్వారా జానకి వెండితెరకు పరిచయమయ్యారు. అందులో ఆమె సుబ్బులు అనే పాత్రలో కనిపించారు. ఈ పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. దీంతో ఆమెను అందరూ షావుకారు జానకి అనడంతో అదే పేరు ఫిక్స్ అయ్యింది.
శుభలేఖ సుధాకర్:
చిరంజీవి హీరోగా నటించిన సినిమా శుభలేఖ….ఈ సినిమాలో సుధాకర్ తొలిసారి నటించారు. అలా సుధాకర్ నటించిన తొలి సినిమానే హిట్ అవ్వడంతో ఆయన పేరు శుభలేఖ సుధాకర్ గా నిలబడిపోయింది.
అల్లరి నరేష్ :
EVV సత్యనారాయణ చిన్న కొడుకు EVV నరేష్ పేరు కాస్త అతని మొదటి చిత్రం అల్లరి కారణంగా ….అదే పేరు ఫిక్స్ అయ్యింది. నరేష్ పేరుతో అంతకుముందే ఓ హీరో ఉండడంతో అల్లరి ఇతని గుర్తింపుగా మారింది.
వెన్నెల కిషోర్:
వెన్నెల సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్ర పోషించిన కిషోర్ కు ఆ సినిమా పేరే గుర్తింపుగా మారి వెన్నెల కిషోర్ అయిపోయాడు.
సత్యం రాజేష్ :
సత్యం రాజేష్ అసలు పేరు రాజేష్ బాబు… సత్యం సినిమాతో అతడికి గుర్తింపు రావడంతో అదే అతని గుర్తింపైంది!
చిత్రం శ్రీను:
చిత్రం శ్రీను అసలు పేరు శ్రీనివాసులు. తేజ డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా చిత్రం ద్వారా ఇతడు తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఈ సినిమా హిట్ తర్వాత ఇతని పేరు చిత్రం శ్రీనుగా స్థిరపడి పోయింది.
దిల్ రాజు:
డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన దిల్ రాజు అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. ఈయన మొదటిగా దిల్ అనే సినిమాకు ప్రొడ్యూసర్ గా చేశారు. ఆ మూవీ హిట్ అవ్వడంతో దిల్ ఆయన ఇంటిపేరైంది.