You are here
Home > viral

కోహ్లీ-రిషబ్-ఓ సంతకం!!

టీం ఇండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ ఆస్ట్రేలియా టూర్ తర్వాత బాగా హాట్ టాపిక్ అయ్యాడు. బాబు బ్యాటింగ్ స్టైల్ కి విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. ప్రత్యర్ధులు కూడా ఓహో అన్నారు. అతని బ్యాటింగ్ స్టైల్ మాత్రమే కాదు ప్రత్యర్ధికి చుక్కలు చూపిస్తున్న విధానం ఫాన్స్ కి నచ్చేసింది. ప్రతికూల పరిస్థితిలో జట్టుని విజయతీరాలకు చేర్చాడు ఈ ఢిల్లీ ఆటగాడు.

ఇక కీపింగ్ విషయంలో విమర్శలు వచ్చినా దాని మీద దృష్టి పెట్టి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక బ్యాటింగ్ లో ఉన్న లోపాలను సవరించుకుంటూ టీం ఇండియాకు ధోనీ లేని లోటు తీర్చే విధంగా అడుగులు వేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఈ క్రికెటర్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఈ ఫోటోలో మాజీ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా ఆటోగ్రాఫ్‌ తీసుకుంటూ స్టిల్ ఇచ్చాడు.

టీం ఇండియాలో ఆశిష్ నెహ్రా ది ప్రత్యేక స్థానం. అతను జట్టులో ఎందరో ఆటగాళ్లకు మార్గదర్శిగా చెప్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే గతంలో కోహ్లీ కూడా అతని వద్ద ఆటో గ్రాఫ్ తీసుకోగా… నెహ్రాది లక్కీ హ్యాండ్ అని అతని హస్తవాసి కారణంగానే ఆటో గ్రాఫ్ తీసుకున్న వాళ్ళు స్టార్లు అయ్యారు అంటూ కామెంట్ లు వస్తున్నాయి సోషల్ మీడియాలో. కాగా రెండు రోజుల క్రితం ముగిసిన చివరి నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ పై సెంచరీ సాధించి భారత విజయానికి బాటలు వేసాడు పంత్.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top