You are here
Home > viral

రావ‌ణుడికి చెందిన 10 ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఇవే..!

రామాయ‌ణంలో రావ‌ణుడి గురించి అంద‌రికీ తెలుసు. రావ‌ణుడు ఎంత‌టి రాక్ష‌సుడో రామాయం చ‌దివే అంద‌రికీ తెలుస్తుంది. అందులో భాగంగానే ద‌స‌రా ఉత్స‌వాల‌కు రావ‌ణుడి బొమ్మ‌ల‌ను ద‌హ‌నం చేస్తారు. అయితే రావ‌ణుడికి సంబంధించిన కింద తెలిపిన ప‌లు ఆస‌క్తిక‌రమైన విష‌యాల‌ను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే రావ‌ణుడి గురించి మీరు భిన్నంగా ఆలోచిస్తారు. ఇంత‌కీ ఆ విష‌యాలు ఏమిటంటే..

ravana

1. రావ‌ణుడు ఒక ర‌కంగా చెప్పాలంటే బ్ర‌హ్మకు ముని మ‌న‌వ‌డు అవుతాడు. రావ‌ణుడి తండ్రి ప్ర‌ముఖ రుషి విశ్ర‌వ‌సుడు. అత‌ను ప్ర‌జాప‌తి పుల‌స్త్యుడి కుమారుడు. ఇత‌ను బ్ర‌హ్మ‌కు చెందిన 10 మంది కుమారుల్లో ఒక‌డు.

2. లంకా న‌గ‌రాన్ని చేరుకునేందుకు రాముడు వాన‌ర‌సేన‌తో వార‌ధి నిర్మిస్తాడు క‌దా. అయితే అందుకు రాముడు ఓ య‌జ్ఞం చేస్తాడు. అందుకు రావ‌ణుడు స‌హ‌క‌రిస్తాడు. శివ‌భ‌క్తుడు క‌నుక రావ‌ణుడు ఆ య‌జ్ఞానికి స‌హ‌క‌రించాడ‌ని ప‌లు రామాయ‌ణాల్లో ఉంది.

3. రావ‌ణుడు తాను చ‌నిపోయే చివ‌రి ఘ‌డియ‌ల్లో ల‌క్ష్మ‌ణుడికి ముఖ్య‌మైన జీవిత పాఠాలు చెబుతాడు. అలాగే ప‌లు విద్య‌ల గురించి బోధిస్తాడు.

4. రావ‌ణుడికి సంగీతం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా వీణ అంటే అత‌నికి ప్రాణం. అందుక‌నే కొన్ని చోట్ల రావ‌ణుడి బొమ్మ‌లు వీణ‌ను ప‌ట్టుకుని మ‌న‌కు క‌నిపిస్తాయి.

5. రావ‌ణుడు గ్ర‌హాల స్థితిగ‌తుల‌ను కూడా నిర్దేశించేవాడ‌ట‌. త‌న కుమారుడు మేఘ‌నాథుడికి చావు లేకుండా చేయ‌డం కోసం గ్ర‌హాల‌ను 11వ ఇంట్లో ఉండాల‌ని చెప్పాడు. అన్ని గ్ర‌హాలు అలాగే చేశాయి. కానీ శ‌ని మాత్రం అలా కాకుండా 12వ ఇంట్లో ఉన్నాడు. దీంతో రావ‌ణుడు శ‌నిపై దాడి చేసి అత‌న్ని జైలులో పెట్టించాడు.

6. అంద‌రు రాక్ష‌సుల లాగే ఏదో ఒక రోజు త‌న‌కు ప‌త‌నం త‌ప్ప‌ద‌ని, విష్ణువుకు చెందిన ఏదో ఒక అవ‌తారంలో తాను చనిపోతాన‌ని రావ‌ణుడికి ముందే తెలుసు. అయినా భూమిపై ఉన్న‌న్ని రోజులు త‌న ప్ర‌వ‌ర్త‌న మార్చుకోలేదు. త‌న విధిని తాను నిర్వ‌ర్తించాడు.

7. రావ‌ణుడికి 10 త‌లలు ఎలా వ‌చ్చాయి అనే దానిపై ర‌క ర‌కాల వివ‌ర‌ణలు ఉన్నాయి. అత‌ని త‌ల్లి అత‌నికి 9 ముత్యాలతో కూడిన ఓ హారం ఇచ్చింద‌ని, అందుక‌నే అత‌నికి 10 త‌ల‌లు ఉన్న‌ట్లు అత‌ని శ‌త్రువుల‌కు క‌నిపిస్తుంద‌ని ప్ర‌చారంలో ఉంది. అయితే శివుడు ఇచ్చిన వ‌రం వ‌ల్ల ఒక త‌ల న‌ర‌క‌గానే ఇంకో త‌ల వ‌స్తుంద‌ని, అలా 10 త‌లలు వ‌స్తాయ‌ని.. ఇంకో వివ‌ర‌ణ ప్ర‌చారంలో ఉంది.

8. రావ‌ణుడు ఒకసారి కైలాస ప‌ర్వతాన్ని లంకలో ఉంచాల‌ని చెప్పి దాన్ని చేతుల్తో ఎత్తుతాడు‌. దీంతో శివుడు ఆగ్ర‌హించి త‌న బొట‌న‌వేలితో రావ‌ణుడి చేతిని తొక్కుతాడు. ఈ క్ర‌మంలో రావ‌ణుడు పెద్ద‌గా అరుస్తూ శివ భక్తితో శివ‌తాండ‌వం చేస్తాడు‌. అయితే శాంతించిన శివుడు రావ‌ణుడి భ‌క్తికి మెచ్చి అతనికి రావ‌ణ అనే పేరును పెడ‌తాడు. అంటే పెద్ద‌గా అరిచే వాడ‌ని అర్థం. రావ‌ణుడికి ఆపేరు అలాగే వ‌చ్చింద‌ని చెబుతారు.

9. రాముడు నెమ్మ‌దిగా లంక‌ను ఆక్ర‌మించి యుద్ధంలో గెలుస్తున్నాడ‌ని తెలిసే స‌రికి రావ‌ణుడు ఓ య‌జ్ఞం ప్రారంభిస్తాడు. అయితే దాన్ని అంగ‌దుడు నాశ‌నం చేసేందుకు య‌త్నిస్తాడు. కానీ ఆ య‌త్నం ఫ‌లించ‌దు. దీంతో అత‌ను రావ‌ణుడి భార్య మండోద‌రిని లాక్కొస్తాడు. అప్పుడు ఆమె రావ‌ణున్ని అవ‌మాన ప‌రుస్తుంది. రాముడు ఓ వైపు త‌న భార్య కోసం వాన‌ర సైన్యంతో క‌దిలి వ‌స్తుంటే నువ్వు మాత్రం నీ భార్య‌ను ఎవ‌రో తీసుకుపోతున్నా ఎందుకు స్పందించ‌డం లేదు, నీకు సిగ్గుగా లేదా ? అని మండోద‌రి అంటుంది. దీంతో రావ‌ణుడు ఆ యాగం పూర్తి కాకుండానే మ‌ధ్య‌లోనే లేచి యుద్ధానికి వెళ్తాడు. ఆ త‌రువాత రాముడి చేతుల్లో చ‌నిపోతాడు.

10. రావ‌ణుడు, అత‌ని సోద‌రుడు కుంభ‌క‌ర్ణుడు నిజానికి వైకుంఠ ద్వార పాల‌కులు. వారు అక్క‌డ జ‌య‌, విజ‌య అనే పేర్ల‌తో ప‌నిచేసేవారు. ఒకసారి కొంద‌రు రుషులు వ‌స్తే వారిపట్ల ఆ ఇద్ద‌రూ నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. దీంతో ఆగ్ర‌హం చెందిన ఆ రుషులు వారిని శ‌పిస్తారు. అయితే ఆ ఇద్ద‌రూ త‌మ‌ను మ‌న్నించాల‌ని, శాపం నుంచి త‌ప్పించే మార్గం చెప్పాల‌ని వేడుకుంటారు. దీంతో 7 త‌రాల పాటు విష్ణువు సేవ చేయ‌మ‌ని లేదా 3 త‌రాల పాటు విష్ణువుకు శ‌త్రువులుగా ఉండమ‌ని, అప్పుడే మోక్షం ల‌భిస్తుంద‌ని చెబుతారు. దీంతో వారు రెండో ఆప్ష‌న్ ఎంచుకుంటారు. ఫ‌లితంగా ఇద్ద‌రూ విష్ణువుకు శ‌త్రువులుగా కాలం గ‌డుపుతారు. చ‌నిపోయాక తిరిగి వైకుంఠం చేరుకుంటారు.

 

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top