You are here
Home > viral

ఈ ఆహారం తింటే మీ మూత్రపిండాలు సూపర్ అంతే…!

ఆహారం అనేది జాగ్రత్తగా లేకపోతే ఆ ప్రభావం మన ఆరోగ్యం మీద చాలా బాగా పడుతుంది. మారుతున్న కాలంలో ప్రజల ఆహార విధానాలు కూడా మారిపోతున్నాయి. ఆహారం అనేది సరిగా లేకపోతే మూత్రపిండాల మీద ప్రభావం పడుతుంది. అయితే… సృష్టిలో దొరికే ఆహారం మనకు పోషక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ… మన ఆరోగ్యాన్ని మేరుగుపరిచేవి అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు.

కానీ ప్రజలు సాధారణంగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు లేదా ఇతర పోషకాలను అసాధారణంగా ఉండే ఆహారాలను సూపర్ ఫుడ్స్ అనడం మొదలుపెట్టారు. మన శరీరం దాని జీవక్రియ మరియు రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి ముఖ్యమైన అవయవాలపై (గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం మరియు ప్లీహము) ఆధారపడి ఉంటుంది. శరీరంలోని ప్రతి భాగం మనకు ముఖ్యమే…

అయితే పైన పేర్కొన్న వాటిల్లో ఏది విఫలం అయినా సరే… ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే మూత్రపిండాలు విఫలం అయిన వాళ్ళు మరణానికి ఒకరకంగా దగ్గర ఉన్నట్టే. కాబట్టి… మీ మూత్రపిండాలు దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడే ఆహారం గురించి మీరు తెలుసుకోవాలి. ప్రోటీన్, కేలరీలు, విటమిన్లు మరియు ఖనిజాలు అన్నీ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినాలి. వీటిల్లో ఒక 5 రకాల ఆహారంతో కూడిన ప్యాక్ ఒకటి ఉంది.

నీరు: ఇది శరీరానికి చాలా ముఖ్యం. నీరు ఎంత ఎక్కువ తీసుకుంటే మనకు అంత మంచిది. మీ శరీరంలో ఉండే ఎన్నో విష వలయాలను నీళ్ళు శుద్ధి చేసి బయటకు మూత్రం ద్వారా పంపేస్తాయి. ఆరోగ్యకరమైన మూత్రపిండాల కోసం, తగినంత నీరు త్రాగాలని వైద్యులు చెప్తున్నారు. సాధారణంగా, రోజంతా కనీసం 2-3 లీటర్లు నీరు త్రాగాలి. మీ ఆహారంలో అదనపు ఉప్పు వాడటం మానేస్తే మంచిది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుందని వైద్యులు చెప్తున్నారు.

water images

యాపిల్స్: యాపిల్స్ ఖరీదైనవి కావడంతో చాలా మంది వెనక్కు తగ్గుతూ ఉంటారు. ఇది కరిగే ఫైబర్… కొలెస్ట్రాల్ మరియు గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లకు ఇది ముఖ్యమైన మూలం. మెదడు కణాలను కూడా యాపిల్స్ ఈ పండు మీ మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది.

applefrut image

చేప: ఒమేగా -3… కొవ్వు ఆమ్లాలు మన శరీరం తయారు చేసుకోలేదు కాబట్టి ఆహారం ద్వారా తీసుకోవాలి. సాల్మన్, ట్యూనా వంటి చేపలు తినాలి. కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్న కొవ్వు చేపలను తీసుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వులకు గొప్ప సహజ వనరు చేపలు. ఒమేగా -3 కొవ్వులు రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తాయి. రక్తపోటును కూడా కొద్దిగా తగ్గిస్తాయి. నియంత్రిత రక్తపోటు మూత్రపిండాలను రక్షించడంలో సహాయపడుతుందని వైద్యులు చెప్తున్నారు.

క్రాన్బెర్రీస్: ఈ రుచికరమైన బెర్రీలు… మూత్రాశయ గోడకు బ్యాక్టీరియా అంటుకోకుండా నిరోధిస్తాయి. దీని ద్వారా మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది.

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ఉన్నవారికి, మూత్రపిండాల పనితీరు తగ్గుతుందనే భయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ భాస్వరం మరియు పొటాషియం కలిగిన ఆహారాన్ని తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. పాల ఆహారాలు, బీన్స్, కాయ ధాన్యాలు, కాయలు మరియు టీ, సోడాలు కూల్ డ్రింక్ లు ఆపితే మంచిది.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top