You are here
Home > viral

మ‌న శ‌రీరంలోని ర‌క్తాన్నంతా పీల్చాలంటే ఎన్ని దోమ‌లు కావాలో తెలుసా? ఇంట్ర‌స్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం!

మ‌నిషి శ‌రీరంలో ర‌క్తం ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. శ‌రీరంలోని భాగాల‌కు ర‌క్తం ఆక్సిజ‌న్‌ను, పోష‌క ప‌దార్థాల‌ను తీసుకుపోతుంది. అందువ‌ల్ల ఎవ‌రి శ‌రీరంలో అయినా స‌రే త‌గినంత ర‌క్తం ఉండాలి. ర‌క్తం లేక‌పోతే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య వ‌స్తుంది. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి.

 

* మ‌న శ‌రీరంలో ఉండే ర‌క్తం మొత్తాన్ని పీల్చేయాలంటే 11,20,000 దోమ‌లు అవ‌స‌రం అవుతాయి.

* శ‌రీరంలోని భాగాల‌కు గుండె ర‌క్తాన్ని పంపు చేస్తుంది కదా. అయితే అందుకు గుండె ఎంతో పీడ‌నాన్ని సృష్టిస్తుంది. అదే బ‌య‌ట అయితే ఆ ప్రెష‌ర్‌కు ర‌క్తం 9 మీట‌ర్ల ఎత్తుకు వెళ్తుంది.

* ప‌ల్స్ లేకుండా మ‌నం జీవించ‌గ‌లం. 2012లో క్రెయిగ్ లెవిస్ అనే 55 ఏళ్ల వ్య‌క్తి శ‌రీరంలో డాక్ట‌ర్లు ఓ డివైస్‌ను ఏర్పాటు చేశారు. దాని స‌హాయంతో ప‌ల్స్ లేకుండానే ఆ వ్య‌క్తి జీవించాడు. అత‌ని శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా కూడా బాగానే జ‌రిగింది.

* స్టాన్ లార్కిన్ అనే వ్య‌క్తి గుండె లేకుండా 555 రోజులు జీవించాడు. అత‌ను హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం ఎదురు చూశాడు. కానీ దొర‌క‌లేదు. దీంతో డాక్ట‌ర్లు అత‌నికి ఒక డివైస్‌ను ఫిక్స్ చేశారు. అది ఒక బ్యాక్ ప్యాక్‌లో ఉంటుంది. దాన్ని అత‌ను వెనుక త‌గిలించుకుని ఉండాలి. అలా అత‌ను ఆ డివైస్‌తో జీవించాడు. ఇంకా చెప్పాలంటే అత‌ను అప్ప‌ట్లో ఆ డివైస్‌ను వెనుక త‌గిలించుకుని బాస్కెట్ బాల్‌ను కూడా ఆడాడు.

* మ‌న శ‌రీరంలో 25 రోజుల స‌మ‌యంలో ప్ర‌వ‌హించే ర‌క్తం ఓ మీడియం సైజ్ స్విమ్మింగ్ పూల్‌లో ఉండే నీటికి స‌మానం.

* మ‌నిషి శ‌రీరంలో 40 శాతం ర‌క్తం పోయినా కొంత సేపు జీవించ‌గ‌ల‌డు. కాక‌పోతే స‌మ‌యం మించిపోయేలోగా అత‌నికి ర‌క్తం ఎక్కించాల్సి ఉంటుంది.

* ప్ర‌పంచంలో చాలా మందికి వ‌చ్చే హార్ట్ ఎటాక్‌ల‌లో 21 శాతం హార్ట్ ఎటాక్‌లు సోమ‌వారం రోజునే వ‌స్తాయ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. త‌రువాత శుక్ర‌వారం ఎక్కువ‌గా హార్ట్ ఎటాక్‌లు వ‌స్తాయ‌ని చెప్పారు.

* మ‌న మూడ్‌ను బ‌ట్టి మ‌న గుండె కొట్టుకునే రేటు మారుతుంది.

* హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉండాలంటే నిత్యం ఉద‌యాన్నే నెమ్మ‌దిగా ఆందోళ‌న‌తో కాకుండా ప్ర‌శాంతంగా నిద్ర‌లేవాలి. అలాగే సాయంత్రం పూట మ‌రీ ఎక్కువ‌గా వ్యాయామం చేయ‌రాదు.

* కొబ్బ‌రి నీళ్లు, మ‌న శ‌రీరంలోని ర‌క్తంలో ఉండే ప్లాస్మా దాదాపుగా ఒకేలా ఉంటాయి. అందుక‌నే వైద్యులు అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ప్లాస్మా ల‌భించ‌క‌పోతే అందుకు బ‌దులుగా కొబ్బ‌రినీళ్ల‌ను ఎక్కిస్తుంటారు.

* ఎ, ఎబి లేదా ఎ, ఓ గ్రూప్ క‌లిగి ఉన్న జంట‌లు ఎక్కువ‌గా విడాకులు తీసుకుంటార‌ని స‌ర్వేలో తేలింది.

* ఓ గ్రూప్ ఉండే వారికి గుండె జ‌బ్బులు రావు. కానీ వారికి చ‌ర్మ క్యాన్సర్‌, స్థూల‌కాయం వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి.

* ఎ గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారు త‌మ శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌పై ఓ క‌న్నేసి ఉంచాలి. లేదంటే గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

* బి గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారికి డ‌యాబెటిస్‌, క్లోమగ్రంథి క్యాన్స‌ర్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

* ఎబి గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారికి మెద‌డు సంబంధ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి.

 

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top