You are here
Home > viral

అంతర్జాతీయ క్రికెటర్ జీవితం ఇంత దారుణమా…?

అంతర్జాతీయ క్రికెట్ లో అవకాశం వస్తే చాలా మంది జీవితాలు మారిపోతూ ఉంటాయి. విలాసవంతమైన జీవితం డబ్బుకి డబ్బు, పేరుకి పేరు… ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ ఒక్కటి కూడా ఉన్నతంగానే ఉంటుంది. కాని కొన్ని దేశాల్లో మాత్రం దరిద్రం రాజ్యమేలుతు ఉంటుంది. ఆఫ్రికా దేశం జింబాబ్వే, వెస్టిండీస్, శ్రీలంక వంటి దేశాలు దరిద్రంతో అల్లాడుతూ ఉంటాయి. అందుకే అక్కడ జాతీయ జట్టుకి ఆడినా సరే పెద్దగా ఫలితం ఉండదు.

surajrandeep

శ్రీలంక మాజీ స్పిన్నర్… చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సూరజ్ రణదీవ్ పరిస్థితి అదే. అతను అంతర్జాతీయ క్రికెట్ లో బాగానే రాణించాడు. కాని అతనికి మాత్రం అనుకున్న విధంగా పరిస్థితి కలిసి రాలేదు అనే చెప్పాలి. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంక తరుపున అతను ఆడాడు. ఇప్పుడు అతను క్రికెట్ నుంచి తప్పుకుని బస్ డ్రైవర్ గా ఆస్ట్రేలియాలో బ్రతుకుతున్నాడు. అతనితో పాటు మరో మాజీ శ్రీలంక క్రీడాకారిణి చింతాకా నమస్తే కూడా బస్ డ్రైవర్ గా పని చేస్తుంది.

మాజీ జింబాబ్వే క్రికెటర్ వాడింగ్టన్ మ్వెంగా కూడా మెల్బోర్న్ (ఆస్ట్రేలియా) కు వలస వచ్చి బస్సు డ్రైవర్లుగా పని చేస్తున్న పరిస్థితి. 36 ఏళ్ల రణదీవ్ 12 టెస్టులు, 31 వన్డేలు, 7 టి 20 లలో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను టెస్టుల్లో 43 వికెట్లు, వన్డేల్లో 36 వికెట్లు తీసాడు. టెస్టులు, వన్డేల్లో ఒక్కోసారి 5 వికెట్లు తీసాడు. ఐపిఎల్ లో కూడా ధోనీ సారధ్యంలో ఆడాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్ 2020-21 కోసం ఆస్ట్రేలియా అతన్ని వాడుకునే ప్రయత్నం చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ కు స్పిన్ లో శిక్షణ ఇవ్వడానికి అతన్ని క్రికెట్ ఆస్ట్రేలియా నెట్ బౌలర్‌ గా పిలిచింది.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top