You are here
Home > viral

వాహనదారులకు గుడ్ న్యూస్…పెట్రోల్, ధరలు తగ్గే ఛాన్స్.!!

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ 8.5 వరకు తగ్గించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉందని… ఈ రెండింటిపై పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం కరెక్ట్ కాదని విశ్లేషకులు తెలిపారు. గత తొమ్మిది నెలల్లో నిరంతరాయంగా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరల దెబ్బకు సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారుల ఆవేదనను తగ్గించడానికి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి.

peatrole

దాన్ని కట్టడి చేయకపోతే… ఎక్సైజ్ డ్యూటీ అంచనా (ఏప్రిల్ 2021 మార్చి 2022) కి 3.2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనాగా ఉంటే 4.35 లక్షల కోట్లుగా పెరుగుతుందని అంటున్నారు. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించే మార్గం ఉందని చెప్తున్నారు. ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో 13 రూపాయలు పెట్రోల్ 16 రూపాయలు డీజిల్ మార్చి 2020 మరియు మే 2020 మధ్య పెరిగాయని లెక్కలు చెప్తున్నాయి.

ఇప్పుడు డీజిల్ పై 31.8 రూపాయలు పెట్రోల్ పై 32.9 లీటరుకు పెరిగాయని లెక్కలు వివరిస్తున్నాయి. ఎక్సైజ్ సుంకం పెరగడం ద్వారా… ఆదాయాన్ని పెంచుకునే మార్గం కేంద్రం ఆలోచించింది అని నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు రెండు దశాబ్దాల కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. చమురు ధరలు తిరిగి పెరిగినా సరే కేంద్రం మాత్రం ధరలను తగ్గించలేదు.

పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60% మరియు డీజిల్ 54% పైగా కేంద్ర మరియు రాష్ట్ర పన్నులు ఉన్నాయి. పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరుకు 91.17 మరియు డీజిల్ 81.47 గా ఉంది. పెట్రోల్ రేట్లు గత నెలలో రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో సెంచరీ మార్క్ దాటాయి. ప్రపంచ చమురు ధరలు క్షీణించడం వల్ల నష్టాలను తగ్గించడానికి 2014 నవంబర్ మరియు 2016 జనవరి మధ్య, ప్రభుత్వం తొమ్మిది సందర్భాలలో పెట్రోల్ మరియు డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top