You are here
Home > viral

టాలీవుడ్ ఫేమస్ దర్శకుల ప్రేమ కథలు… మీకు తెలియని లవ్ స్టోరీస్…!

టాలీవుడ్ లో సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న దర్శకులు ఎందరో ఉన్నారు. అందమైన సినిమాలను మనకు అందించి వాళ్ళ నిజ జీవితాన్ని కూడా అందంగా మలుచుకున్న దర్శకులు ఎందరో ఉన్నారు. ఇక కొంత మంది దర్శకులు అయితే తమ తమ సినిమాల పేర్లను తమ ఇంటి పేరుగా మార్చేసుకోవడం కూడా జరిగింది. అలాగే తమ భార్యలను కూడా సినీ ప్రపంచంలోనే వెతుక్కున్నారు. అందులో బాగా ఫేమస్ అయిన 8 మంది డైరెక్టర్ ల లవ్ స్టోరీలు చూద్దాం.

బొమ్మరిల్లు భాస్కర్…

బొమ్మరిల్లు సినిమా ద్వారా ఈయన పేరు మార్మోగింది. ఈ సినిమా ఇప్పటికీ ఏదోక ఇంట్లో చూస్తూనే ఉంటారు. అంతటి మంచి సినిమా అందించిన భాస్కర్… వైజాగ్ పంపిణీదారు క్రాంతి రెడ్డికి కుటుంబ స్నేహితుడైన శ్రీ విద్యతో స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నాడు. 9 నెలలకు వివాహం చేసుకున్నాడు.

నాగ్ అశ్విన్…

మహానటి సినిమాతో బాగా ఫేమస్ అయిన ఈ యువ దర్శకుడు ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ కుమార్తె ప్రియాంకా దత్ ని ప్రేమించాడు. ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా సమయంలో ప్రియాంకా దత్ ప్రేమించి ఇంట్లో చెప్పగా గత ఏడాది వివాహం చేసుకున్నారు.

కృష్ణ వంశీ రమ్యకృష్ణ

చంద్రలేఖ షూట్ సమయంలో, కృష్ణ వంశీ మరియు రమ్య కృష్ణ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వివాహం చేసుకోగా వీరికి ఒక కుమారుడు కూడా పుట్టాడు.

పూరి జగన్నాథ్…

దూరదర్శన్ లో సీరియల్స్ కోసం పని చేసే టైంలో పూరి లావణ్యతో ప్రేమలో పడ్డాడు. ఇక ఈ జంట టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయింది.

puri 3

రాజమౌళి…

టాలీవుడ్ లో వీరు తెలియని వారు లేరు. రాజమౌళి, రామ రాజమౌళి ప్రేమించి వివాహం చేసుకున్నారు. రాజమౌళి కోసం తన భర్త వద్ద రమా విడాకులు తీసుకుని 9 ఏళ్ళ కుమారుడితో రాజమౌళి వద్దకు వచ్చేశారు. 2001 లో వివాహం చేసుకున్నారు.

 

మారుతీ…

బందర్ లో నెంబర్ ప్లేట్ స్టిక్కరింగ్ షాప్ నడుపుతున్న సమయంలో స్పందన అనే అమ్మాయిని ప్రేమించి ఆ తర్వాత డైరెక్టర్ గా మారిన తర్వాత హైదరాబాద్ లో అందరిని ఒప్పించి వివాహం చేసుకున్నాడు.

శ్రీకాంత్ అడ్డాలా…

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తరహాలో మహేష్ బాబు సమంతా మాదిరి తన దూరపు బంధువుని ఫంక్షన్ లో కలుసుకుని ఆ తర్వాత రెండు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.

సంపత్ నంది

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఈ యువ దర్శకుడు చాలా కష్టపడ్డాడు. ఉపేంద్ర తో ఒక సినిమా 95 శాతం పూర్తి అయిన తర్వాత అనేక ఇబ్బందులు వచ్చాయి. అక్కడి నుంచి రెండేళ్ళ పాటు ఎదురు చూసి వివాహం చేసుకున్నాడు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top