You are here
Home > viral

సెలూన్ షాప్ లో మ‌సాజ్ చేయించుకుంటున్న మ‌హిళ వీడియో….వైర‌ల్ అవుతున్న ఈ వీడియో వెనుక స్టోరి!

రెండు మూడు రోజులుగా సోష‌ల్ మీడియాలో …సెలూన్ లో మ‌సాజ్ చేయించుకుంటున్న ఓ మ‌హిళ వీడియో వైర‌ల్ అవుతుంది. ఈ వీడియోకు ఎవ‌రికి వారు త‌మ‌కు తోచిన స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు. ఫ‌స్ట్ ఆ వీడియోను చూసి…. జ‌నాలు చేస్తున్న ఓ కామెంట్ ను చూద్దాం…త‌ర్వాత అస‌లు ఆ వీడియో ఏంటో దాని క‌థేంటో చూద్దాం.

Watch Video First : 

ఆ వీడియో మీద వ‌చ్చిన కామెంట్ :
అమ్మాయిలు ఇలా కూడా మాలీస్ చేయించుకుంటారా? సరే ఒకవేళ చేయించుకున్నా… లేడీస్ బ్యూటీపార్లర్ లల్లో చేయించుకుంటే బాగుండేది…ఇలా ఆమె ఆ మాలీష్ కు అలసటగా మత్తుగా పడిపోతోంది! పొరపాటున ఏదైనా అనుకోనిది జరిగితే ??? ఎవరు బాద్యులు ??? మళ్ళీ … అటు పోలీసుల మీద, ఇటు ప్రభుత్వంమీద ఆపైన తల్లుల పెంపకాలమీద పడి ఏడుస్తామేకానీ… మన తప్పును నిర్లక్ష్యాన్ని మాత్రం చస్తే ఒప్పుకోము అలా ఒప్పుకోవడానికి ఇగో అడ్డు వస్తుంది మరి! మ‌నం హద్దుల్లో ఉండాల్సిన అవసరంలేదా ??? ఎప్పుడూ… మనం అనుకున్నట్లే జరగదు కదా? కొంచెం మనం కూడా మ‌న జాగ్ర‌త్త‌లో ఉండ‌డం మంచిది క‌దా!

ఇప్పుడు ఆ వీడియో క‌థేంటో చూద్దాం!

ఈ వీడియో 2020 ఆగ‌స్ట్ లో తీసింది. ది బార్బ‌ర్ క్ల‌బ్ అనే యూట్యూబ్ ఛాన‌ల్ లో పోస్ట్ చేయ‌బ‌డింది. ఇందులో మ‌సాజ్ చేయించుకునే మ‌హిళ ఓ మోడ‌ల్ ఆమె పేరు అనిందిత వీడియో షూట్ మ‌రియు ప‌బ్లిసిటి కోస‌మే ఈ మ‌సాజ్ చేశారు. దీని వెనుక మ‌నం ఊహించుకున్నంత సీన్ మాత్రం లేదు.

ఇక మ‌సాజ్ గురించి :
ఇలాంటి మ‌సాజ్ చాలా ప్ర‌మాద‌క‌రం… ముఖ్యంగా మెడ‌లు విర‌వ‌డం చాలా డేంజ‌ర్…మెడ భాగంలో చాలా సున్నిత‌మైన న‌రాలు ఉంటాయి….ఒక్కోసారి ఇలా చేయ‌డం వ‌ల్ల వాటిపై తీవ్ర ఒత్తిడి ప‌డి చిట్లిపోయే ప్ర‌మాదం కూడా ఉంది. మీరు మ‌సాజ్
చేయించుకునే స‌మ‌యంలో మెడ‌లు తిప్ప‌డం లాంటివి చేయించుకోకండి. మ‌సాజ్ ల‌కు అల‌వాటు ప‌డ‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం…. కేవ‌లం ఆయిల్ అప్లై చేయించి….సున్నితంగా మ‌సాజ్ చేయించుకుంటే చాలు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top