మహేష్ బాబు నిజం సినిమాలో…ఉల్లిగడ్డతో జ్వరం తెప్పించుకునే సీన్ ఉంటుంది! మరి నిజంగానే సంకలో ఉల్లిగడ్డ పెట్టుకుంటే జ్వరం వస్తుందా? అంటే అవును అనే చెప్పాలి. దాని వెనుక చిన్న సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అందేంటో ఇప్పుడు చూద్దాం.!
సహజంగానే….ఉల్లిగడ్డలకు బ్యాక్టీరియాలను, వైరస్ లను ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒకసారి కోసిన ఉల్లిగడ్డను మళ్లీ వాడకూడదు అంటారు.! అలా కోసిన ఉల్లి గడ్డలు సంకలో పెట్టడం వల్ల….అక్కడ ఉండే సున్నితమైన పొర ఉల్లిరసాన్ని పీల్చుకుంటుంది.!
దీంతో శరీరంలో ఉంటూ మనకు మంచి చేసే వైరస్ లు, బ్యాక్టీరియాలు…శరీరానికి ఏదో ఆపద వచ్చిందని… శరీరానికి నష్టం కలిగించే వస్తువేదో…సంక దగ్గర ఉందని గ్రహించి… దానితో పోరాడడానికి అక్కడికి చేరుకుంటాయి.! ఉల్లిపాయలో ఉండే సహజ రసాయనాలైన సుఫాక్సీడ్, ఐసోలైన్ మరియు ఎలిసిన్ లకు వ్యతిరేఖంగా అవి పనిచేస్తాయి…ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది.దాన్నే మనం జ్వరంగా ఫీల్ అవుతాం.!
ఇలా వచ్చిన జ్వరం త్వరగానే తగ్గిపోతుంది. కానీ బీపీ షుగర్ లు ఉన్న వాళ్లు ఈ విధంగా చేసి ఒక్కసారిగా తమ బాడీ టెంపరేచర్ పెంచుకోవడం ప్రాణాలకే ప్రమాదం!