You are here
Home > viral

“పోకిరి-2” అనుకున్న ఈ సినిమా… మ‌హేష్ బాబుతో కాకుండా గోపిచంద్ తో ఎందుకు చేయాల్సి వ‌చ్చింది?

2009 లో ఎక్ నిరంజన్ ఫ్లాప్ అయిన త‌ర్వాత ఎలాగైనా హిట్ కొట్టాల‌ని ఫిక్స్ అయిన పూరీ అప్పుడెప్పుడో ….ఎన్ కౌంట‌ర్ స్పెషలిస్ట్ దయా నాయక్ స్పూర్తితో రాసుకున్న క‌థ బూజు దులిపాడు. ఎలాగో మ‌హేష్ తో ఇంకో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుండో అనుకుంటున్నాడు కాబ‌ట్టి…..ఇదే క‌థ‌ను పోకిరి 2 గా తీయాలని మ‌హేష్ కు చెప్పాడు. కానీ మ‌హేష్ అప్ప‌టికే ఖ‌లేజా షూట్ లో ఉన్నాడు….ఆ సినిమా ఎప్పుడైపోతుందో అనే క్లారిటీ లేక‌పోవ‌డంతో వెంట‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసిన పూరీ…..ఈ క‌థ‌ను వివ‌రించాడు. అదే స‌మ‌యంలో ప‌వ‌న్ కొమ‌రం పులి సినిమాతో బిజీ ఉన్నాడు…దీంతో ఆ సినిమాను ఎవ‌రితో నైనా తీసి హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు పూరీ!

gopichand pokiri 2 movie

అప్పుడే…లక్ష్యం , శౌర్యం సినిమాలతో మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ అయితే ఈ క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతాడని అత‌డిని కలిసి కథ చెప్పాడు పూరీ… సింగిల్ లైన్ లోనే ఓకే చెప్పాడు గోపీచంద్.!నిర్మాత‌గా బెల్లంకొండ సురేష్ ముందుకు రావ‌డంతో సినిమా ప‌ట్టాలెక్కింది. హీరోయిన్ గా మొదట హన్సికని అనుకున్నారు కానీ రెమ్యునరేషన్ విష‌యంతో తేడా రావ‌డంతో ఆమెను పక్కన‌ పెట్టి ప్రియమణిని తీసుకున్నారు.

షూటింగ్:

అలా 2009 డిసెంబర్ 21 న షూటింగ్ స్టార్ట్ అయింది . హైదరాబాద్, బ్యాంకాక్, చెన్నైలో కేవ‌లం 62 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మే 27 న రిలీజైన గోలిమార్ సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. గోపిచంద్ కెరీయర్లోనే ఈ సినిమాకు బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. మగాళ్ళు ఒట్టి మాయగాల్లే సాంగ్ ప్ర‌తిచోట మారుమోగింది. ఇలా అందరిని ఆకట్టుకున్న గోలిమాకం సినిమాని 50 రోజుల తర్వాత మర్యాదరామన్న సినిమాకోసం చాలా థియేటర్స్ లోతీసేసారు .లేదంటే కమర్షియల్ గా ఇంకా పెద్ద సక్సెస్ అయ్యేది ..

కలెక్ష‌న్స్ :

10 కోట్ల‌తో తెర‌కెక్కిన ఈ సినిమా…. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి… ఫస్ట్ వీక్ 9 కోట్లు కలెక్ట్ చేసి గోపిచంద్ కెరీయర్లో టాప్ ఫస్ట్ వీక్ మూవీగా నిలిచింది. 80 సెంటర్స్ లో 50 డేస్ , 12 సెంటర్స్ లో 100 డేస్ ప్రదర్శించి టోటల్ గా 25 కోట్లకు పైగా క‌లెక్ట్ చేసింది.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top