You are here
Home > viral

ఈ పదిమంది ఇప్పుడు స్టార్స్.. ఒకప్పుడు సైడ్ యాక్టర్స్

సినిమా ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్లవ్వడం కష్టం..ఎవరో ఒకరిద్దరికి మాత్రమే అలాంటి అదృష్టం ఉంటుంది.. అలాంటివారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు..కానీ ఇంకొందరు ఓవర్ నైట్ స్టార్లయినట్టుగా అనిపించినా వారి సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలుంటాయి.. అలా స్టార్లయిన వాళ్లు కూడా మెల్లిమెల్లిగా ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వచ్చినవారుంటారు..ఇప్పుడు మనం టాప్ యాక్టర్స్ గా అభిమానిస్తున్న వాళ్లల్లో కొందరు ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలు చేసినవారు కూడా ఉన్నారు..వారిలో కొంతమంది..

విజయ్ దేవరకొండ:

vijay devarakonda

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారనుకుంటారు చాలామంది.. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా మూవీలో ,శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాల్లో విజయ్ నటించాడని…అంతేకాదు ఎవడే సుబ్రమ్మణ్యంలో నాని స్నేహితుడిగా నటించాడు విజయ్..

సాయిపల్లవి:

ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికి…మళయాలం సినిమా ప్రేమమ్ తో అప్పటికే మార్కులు కొట్టేసింది సాయిపల్లవి..అందులో ముఖం నిండా మొటిమలతో కనిపించినప్పటికి సాయిపల్లవి నవ్వుకి, యాక్టింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు.. అంతకుముందు ఢీ డ్యాన్సింగ్ షోలో కూడా పార్టిసిపేట్ చేసిన సాయిపల్లవి..మీరాజాస్మిన్, విశాల్ జంటగా వచ్చిన “పందెం కోడి” సినిమాలో మీరాకి స్నేహితురాలిగా నటించింది..తర్వాత ఎంబిబిఎస్ చదవడానికి ఆస్ట్రియా వెళ్లిపోయింది..భవిష్యత్ లో సినిమాలు లేకపోయినా డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్కుంటా అని దీమా చెప్తుంది.

త్రిష:

వర్షం సినిమాతో తెలుగు వాళ్లకి పరిచయం అయిన త్రిష..రెండు దశాబ్దాలు దాటినా టాప్ హీరోయిన్ స్థానాన్ని పదిలంగా నిలబెట్టుకుంది.. వర్షం కంటే ముందు జోడీ సినిమాలో సిమ్రాన్ స్నేహితురాలిగా నటించింది.. ఫాల్గుని ఫాఠక్ ఆల్బమ్ సాంగ్లో ఆయేషా టకియాతో పాటు నటించింది.

రవితేజ:

మాస్ మహరాజా రవితేజ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడు..అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటూనే చిన్నచిన్న పాత్రలు పోషించాడు..అల్లరి ప్రియుడులో రాజశేఖర్ ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకడిగా రవితేజని చూడొచ్చు..తర్వాత ఎన్నో సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన రవితేజ ,బ్రహ్మాజి హీరోగా క్రిష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన “సింధూరం” సినిమాలో సెకండ్ హీరోగా నటించారు..  శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన  “నీకోసం” సినిమా రవితేజ హీరోగా నటించిన మొదటి చిత్రం.

Ravi teja in allari priyudu

కాజల్:

kajal with ishwara rai

హింది చిత్రం క్యూ హో గయా నా లో ఐశ్వర్యరాయ్ కి ఫ్రెండ్ గా నటించింది కాజల్..లక్ష్మీ కళ్యాణంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

రీతు వర్మ:

reetu varma in badsha

పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ..ఎన్టీయార్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్ షా సినిమాలో కాజల్ కి చెల్లెలుగా, తనికెళ్లభరణి కూతురిగా నటించింది.

శర్వానంద్:

యువసేన సినిమాలో నలుగురు హీరోల్లో ఒకడిగా పరిచయం అయిన శర్వానంద్..తర్వాత ఎన్నో సైడ్ క్యారెక్టర్స్ చేశాడు.. సరైన హిట్ పడడానికి సుమారు పదేళ్లు పైనే పట్టింది శర్వానంద్ కి..

విజయ్ సేతుపతి:

తమిళ నటుడు విజయ్ సేతుపతికి తెలుగు వాళ్లల్లో కూడా ఫ్యాన్స్ ఎక్కువమందే ఉన్నారు..పిజ్జా,నేను రౌడి లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు..96 సినిమాతో విజయ్ సేతుపతికి సౌతిండియా మొత్తంలో ఫాలోయింగ్ పెరిగిపోయింది..ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్న విజయ్ సేతుపతి ఒకప్పుడు ధనుష్, కార్తీ, జయం రవి ఇలా వీళ్లందరు హీరోలుగా చేసిన సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో నటించాడు.

నవీన్ పొలిశెట్టి:

గతేడాది రిలీజైన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు నవీన్ పొలిశెట్టి.. తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో విజయ్ దేవరకొండ, నవీన్ ఇద్దరూ స్నేహితులుగా నటించారు.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినిమా చిచొరే లో కూడా నటించాడు నవీన్..యూట్యూబ్ ఓపెన్ చేస్తే నవీన్ వీడియోలకు ఎందరో ఫ్యాన్స్ ఉంటారు.. నవీన్ నెక్స్ట్ మూవీ జాతిరత్నాలు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సత్యదేవ్:

satyadev in mr pefect

2011లో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో చాలా చిన్న రోల్ పోషించాడు సత్యదేవ్.. అసలు ఆ సినిమాలో తను నటించాడని కూడా చాలా తక్కువ మందికి తెలుసు.. తర్వాత ఎన్నో సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటిస్తూ, చిన్న సినిమాలకు హీరోలుగా చేస్తూ వచ్చాడు..ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకున్నాడు.. సత్యదేవ్, నవీన్ పొలిశెట్టి లాంటి వాళ్లు నటులుగా ప్రూవ్ చేస్కున్నారు..కానీ ఇంకా సరైన హిట్ పడాల్సి ఉంది.

అన‌సూయ: 
రంగ‌మ‌త్త‌గా పేరు తెచ్చుకున్న అన‌సూయ‌… NTR నాగా సినిమాలో స్టూడెంట్ గా న‌టించారు.!

 

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top