You are here
Home > viral

స్టువ‌ర్ట్ పురం దొంగ‌లు….అస‌లు ఈ ఊరు ఎక్క‌డుంది? ఈ దొంగ‌ల క‌థేంది? దీని చ‌రిత్రేంటి??

స్టువ‌ర్ట్ పురం అన‌గానే దొంగ‌లు, దొంగ‌త‌నాలు గుర్తొస్తాయి…. గుగూల్ లో సెర్చ్ చేసి చూసినా…. ఎక్కువ‌గా దొంగ‌త‌నాల న్యూస్ లోనే ఆ ఊరిపేరు క‌నిపిస్తుంది. ఇంత‌కీ ఈ ఊరు ఎలా పుట్టింది… ఆ దొంగ‌త‌నాల క‌థేంటో ఇప్పుడు తెల్సుకుందాం!

భార‌త‌దేశాన్ని బ్రిటీష‌ర్లు ప‌రిపాలిస్తున్న కాలంలో…. దారి దోపిడీ దారుల‌ను బంధించి వారిని కొన్ని రోజులు జైల్లో ఉంచి…వారిలో మార్పును తెచ్చి వారికి పునరావాసాన్ని క‌ల్పించ‌డం కోసం కొన్ని కాల‌నీల‌ను ఏర్పాటు చేసి ఇచ్చేవారు….అలా దోపిడీ దారుల‌కు ఇచ్చిన ఒక కాల‌నీయే స్టువ‌ర్ట్ పురం….ఇది బ్రిటిష్ హోం సెక్రెటరీ హెరాల్డ్ స్టువర్ట్ పేరు మీదుగా వ‌చ్చింది….ఇది గుంటూరు జిల్లాలో ఉంది.

అయితే ఈ స్టువ‌ర్ట్ పురం వెనుక మ‌రో స్టోరి కూడా ఉంది. బ్రిటీష్ ప్ర‌భుత్వం 1871లో Indian Criminal Act ను తీసుకొచ్చింది దీని ప్ర‌కారం భార‌త‌దేశంలోని 237 కులాలను దారి దోపిడీ కులాలుగా ధృవీక‌రించింది. ఈ కులంలో పుట్టిన ప్ర‌తి ఒక్క‌రిని దొంగ‌లుగానే భావించేవార‌ట‌….వారంద‌రినీ ఒకే కాల‌నీలో ఉంచేవార‌ట‌…. ఆ కాల‌నీ చుట్టూ ప‌టిష్ట గ‌స్తీ ఉండేద‌ట‌…. ఆ దరిదాపులో ఓ దొంగ‌త‌నం జ‌రిగినా….వీరినే అనుమానించి…వారిని చావ‌బాది బ‌ల‌వంతంగా ఆ త‌ప్పును ఒప్పుకునేలా చేసేవార‌ట‌! వీరికి కేటాయించిన ప్రాంతంలో త‌ప్పితే వేరు ద‌గ్గ‌ర సంచ‌రించినా నేర‌మే!

ఖాకీ సినిమాలోని బ‌వ‌రియా అనే తెగ కూడా ఇలా ముద్ర‌వేయ‌బ‌డిన కుల‌మే…అయితే వీరిని ఒక ప్రాంతంలో మాత్ర‌మే ఉండేలా చేయ‌డంతో…. వారికి ఉపాధి దొర‌క‌క చాలా మంది ఆక‌లితో చ‌నిపోయేవార‌ట‌…ఇంకా కొంత మంది త‌మ మీద ఎలాగో ఆ ముద్ర ప‌డింది కాబ‌ట్టి…. ఆ ఊర్లోనుండి పారిపోయి అదే ప‌నిని కొన‌సాగించేవార‌ట‌!

ఇప్పుడు మ‌న స్టువ‌ర్ట్ పురంతో పాటు ఇలా వేరు చేయ‌బ‌డిన కాల‌నీలు మారాయి. జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసి దేశాభివృద్దికి తోడ్ప‌డుతున్నారు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top