You are here
Home > viral

తాను క‌ట్టించిన తాజ్ మ‌హాల్ ను ….చీక‌టి గ‌దిలో ఉంటూ ఓ అద్దంలో చూడాల్సిన అవ‌స‌రం షాజ‌హాన్ కు ఏమొచ్చింది?

“తాజ్ మహల్ “ కొందరికి అది సమాధి మాత్రమే..కానీ ప్రపంచానికి ప్రేమకి చిహ్నం.. కానీ దాని నిర్మాణం వెనుక ఎన్నో విషాదాలు..అంతు చిక్కని రహస్యాలు.. తాజ్ మహల్ గురించిన ఆసక్తికర విషయాలు మీకోసం..

తాజ్ మహల్ విశేషాలు..

  • 1631లో చేపట్టిన తాజ్ మహల్ నిర్మాణం 1653లో పూర్తయింది..సుధీర్గంగా 22,000 వేల మంది 22 ఏళ్లపాటు శ్రమించి తాజ్ మహల్ ని నిర్మించారు..సుమారు 1000 ఏనుగులను ఉపయోగించారు.
  • ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాలరాతితో నిర్మించబడింది.ఇప్పటికి ఈ పాలరాయి చాలా ఖరీదైనది..
  • నాలుగు వైపులా ఉండే స్తంభాల నిర్మాణం ఎలా చేపట్టారనేది ఇప్పటికి ఏ ఇంజనీర్ కి అంతుపట్టని విషయం..ఎంత పెద్ద భూకంపం వచ్చినా కూడా వాటిని కదిలించలేదు.
  • తాజ్ మహల్ లో ఎన్నో అండర్ గ్రౌండ్ రూంస్, మరియు సొరంగాలు ఉన్నాయి.. వాటి గురించి ఇప్పటికి బయటి ప్రపంచానికి తెలియదు.
  • ఆసక్తికరమైన విషయం ఏంటంటే తాజ్ మహల్ పునాది నిర్మాణాన్ని చెక్కతో చేయడం..
  • నాలుగు దిక్కుల్లో ఏ వైపు నుండి చూసినా ఒకేలా కనిపించడం తాజ్ మహల్ విశేషం.

taj mahal

 

షాజహాన్ – ముంతాజ్..

షాజహాన్ ఏడుగురి భార్యల్లో ముంతాజ్ నాలుగవ భార్య..పదమూడు మంది పిల్లల్ని కన్న తర్వాత పద్నాలుగవ డెలివరి అప్పుడు ముంతాజ్ చనిపోయింది. చనిపోయే నాటికి ముంతాజ్ వయస్సు 39 సంవత్సరాలు మాత్రమే.ఐరనీ ఏంటంటే ముంతాజ్ పై తన  ప్రేమకు గుర్తుగా తాజమహల్ కట్టించిన షాజహాన్.. ముంతాజ్ చనిపోయిన వెంటనే ముంతాజ్ చెల్లిని వివాహం చేసుకున్నాడు.

షాజహాన్ ని వదలని కర్మ సిద్దాంతం :

షాజహాన్ ,ముంతాజ్ ల కుమారుడు ఔరంగజేబు..తాజ్ మహల్ నిర్మాణం పూర్తయిన తర్వాత షాజహాన్ పట్టుబడడంతో, వారసత్వపరంగా ఔరంగజేబు రాజ్యాధికారం చేపట్టాడు.. కన్నతండ్రిని చీకటి గదిలో బంధించి హింసకు గురిచేశాడు ఔరంగజేబు.. సేమ్ ఇదే తరహాలో తన తండ్రి జహంగీర్ ని శిక్షించాడు షాజహాన్…

ఆ చీకటి గదిలో కనీసం తాజ్ మహల్ ని చూసుకోవడానికి ఒక అద్దం ఏర్పాటు చేయమని కోరాడు షాజహాన్.. కిటికిలో నుండి తాజ్ మహల్ ప్రతిబింబం అద్దంలో కనపడే విధంగా ఏర్పటు చేయించాడు..ప్రతిరోజు ఆ చీకటి గదిలో నుండి ఆ అద్దంలో తాజ్ మహల్ ని చూస్తూ ఉండేవాడు.

shajahan

ఒకరోజు తన కొడుకుతో సమయం గడుపుతున్న ఔరంగజేబుతో తన సవతి తల్లి ఒకరు.. “షాజహాన్ నిన్ను ఇంతకంటే ప్రేమగా చూసుకున్నాడు, కానీ ఇప్పుడు కన్నకొడుకు చేతిలోనే బంధీగా మిగిలిపోయాడు అని వాపోయింది..దాంతో రియలైజ్ అయిన ఔరంగజేబు వెంటనే చీకటి గది దగ్గరకు వెళ్లేటప్పటికి షాజహాన్ మరణించి ఉన్నాడు.. “అద్దంలో తాజ్ మహల్ ని చూస్తూనే..” తన తల్లి సమాధి పక్కనే తండ్రికి  సమాధి కట్టించాడు ఔరంగజేబు..కొంచెం పెద్దదిగా…

shajahan muntaj

ఇప్పటికి ఆ “కన్నీటి చుక్క” ఒక మిస్టరీనే..!

వాస్తవానికి తాజ్ మహల్ నిర్మాణ చేపట్టినప్పుడు ఆగ్రా అంతా కరువుతో అల్లాడిపోతుంది..అయినప్పటికి అదేం పట్టించుకోకుండా తాజ్ మహల్ నిర్మాణం కొనసాగేలా చేశాడు షాజహాన్..ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో శిల్పకళాకారులను రప్పించి వారిని తాజ్ మహల్ కోసం పనిచేయించుకున్నాడు.. అంతటి సుందరమైన నిర్మాణం పూర్తయ్యాక అటువంటి నిర్మాణాన్ని వారెవరూ మళ్లీ నిర్మించకూడదని..అందరి చేతులు  నరికేయమని ఆదేశించాడ‌ట‌! .

shajahan

ఈ విషయం తెలుసుకున్న పర్షియన్ ఆర్కిటెక్టర్ ఉస్తాద్ ఇసా.. ఎవరైతే తాజ్ మహల్ కి ఛీప్ ఆర్కిటెక్చర్ గా వ్యవహరించారో అతను.. చివరిసారిగా తాజ్ మహల్ ని చూసుకోనివ్వమని వేడుకున్నాడు..దానికి అంగీకారం రావడంతో తాజ్ మహల్ ని చూడడానికి లోపలికి వెళ్లిన ఉస్తాద్ అక్కడ ఒక గోడకు తను తెచ్చిన ఉలితో గట్టిగా ఒక దెబ్బ వేసాడు.. తర్వాత ప్రతి ఏడాది అదే రోజు, ఒకే సమయానికి ఒక కన్నీటి బొట్టు రాలి ముంతాజ్ సమాదిపై పడుతుంది..ఇంతకీ అదెక్కడి నుండి పడుతుంది అనేది ఇప్పటికి ఒక మిస్టరీనే..!

 

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top