You are here
Home > viral

వన్డే చ‌రిత్ర‌లో ఇండియ‌న్ బ్యాట్స్‌మెన్ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ ఇవే..!

క్రికెట్ చ‌రిత్ర‌లో ఎంతో మంది ప్లేయ‌ర్లు ఎన్నో మ్యాచ్‌లో అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడారు. భార‌త క్రికెట్ జ‌ట్టులో ఎంతో మంది ఆట‌గాళ్లు అలాంటి వీరోచిత ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టును అనేక సంద‌ర్భాలలో విజ‌య తీరాల‌కు చేర్చారు. అయితే వారిలో కొంద‌రు మ‌రీ రెచ్చిపోయి అత్యంత వేగంగా ఆడి ఫాస్టెస్ట్ సెంచ‌రీలు, హాఫ్ సెంచ‌రీలు చేశారు.

these-are-the-heroic-innings-played-by-indian-batsmen-in-odi-history

 

భార‌త జ‌ట్టు త‌ర‌ఫున 1983లో వెస్టిండీస్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో ఆడిన క‌పిల్ దేవ్ కేవ‌లం 22 బంతుల్లోనే అర్ధ సెంచ‌రీ చేశాడు. అలాగే 2000వ సంవ‌త్స‌రంలో జింబాబ్వేతో జ‌రిగిన ఓ వ‌న్డే మ్యాచ్‌లో అజిత్ అగార్క‌ర్ 21 బంతుల్లోనే 50 ప‌రుగులు చేశాడు. 2001లో కెన్యాతో జ‌రిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్ 22 బంతుల్లో 50 చేయ‌గా, 2003లో న్యూజిలాండ్ తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో రాహుల్ ద్రావిడ్ 22 బంతుల్లో 50 చేశాడు. 2004లో బంగ్లాదేశ్తో జ‌రిగిన మ్యాచ్‌లో యువ‌రాజ్ సింగ్ 22 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఇక ఈ లిస్ట్‌లో అత్యంత త‌క్కువ బంతుల్లోనే 50 ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా అజిత్ అగార్క‌ర్ నిలిచాడు.

2013లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 52 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. ఇంకో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపైనే 61 బంతుల్లో కోహ్‌లి సెంచ‌రీ బాదాడు.

2008లో వీరేంద‌ర్ సెహ్వాగ్ న్యూజిలాండ్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో 60 బంతుల్లో సెంచ‌రీ చేయ‌గా, 1988/89ల‌లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అజారుద్దీన్ 62 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు.

ఇక ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో అత్యంత ప‌వ‌ర్‌ఫుల్ బ్యాట్స్‌మ‌న్ గా, హిట్ మ్యాన్ గా పేరు గాంచిన రోహిత్ శ‌ర్మ వ‌న్డే చ‌రిత్ర‌లోనే 3 డ‌బుల్ సెంచ‌రీలు చేశాడు. ఈ ఫీట్ సాధించిన ఏకైక క్రికెట్ ప్లేయ‌ర్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. దీన్ని ఇంకో బ్యాట్స్‌మ‌న్ ఇప్ప‌ట్లో సాధించ‌డం అసాధ్య‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. స‌ద‌రు డబుల్ సెంచ‌రీల్లో రోహిత్ ఒక‌టి ఆస్ట్రేలియాపై చేయ‌గా, మ‌రో 2 డ‌బుల్ సెంచ‌రీల‌ను శ్రీ‌లంక‌పై సాధించాడు.

బెంగళూరు చిన్న‌స్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాపై రోహిత్ శ‌ర్మ‌ 209 ప‌రుగులు చేయ‌గా, కోల్‌క‌తా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శ్రీ‌లంక‌పై 264 ప‌రుగులు, మొహాలిలో మళ్లీ శ్రీ‌లంక‌పైనే 208 ప‌రుగులు చేశాడు. ఇక వ‌న్డేల్లో డ‌బుల్ సెంచ‌రీలు చేసిన మ‌రో ఇద్ద‌రు బ్యాట్స్‌మెన్లు కూడా భార‌తీయులే. సెహ్వాగ్ వెస్టిండీస్‌పై 219 ప‌రుగులు చేయ‌గా, స‌చిన్ సౌతాఫ్రికాపై 200 స్కోరు సాధించాడు. ఇవ‌న్నీ ఆయా ప్లేయ‌ర్లు భార‌త్ త‌ర‌ఫున సాధించిన అత్యుత్త‌మ రికార్డులుగా చెప్ప‌వ‌చ్చు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top