You are here
Home > viral

దరిద్రం అంటే ఆ టీం ఇండియా క్రికెటర్ దే…!

ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టెస్ట్ లో టీం ఇండియా విజయం దిశగా అడుగులు వేస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఇప్పుడు క్రీజ్ నిలబడటానికి కూడా ఆపసోపాలు పడుతుంది. టీం ఇండియా స్పిన్నర్ లు అశ్విన్, అక్షర పటేల్ స్పిన్ దెబ్బకు ఇంగ్లాండ్ ఇబ్బందులు పడుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో మరోసారి టీం ఇండియా యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ని దరిద్రం వెంటాడింది.

sundar

చెన్నైలో జరిగిన మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో 85 పరుగులు చేసాడు ఈ యువ బ్యాట్స్మెన్. అయితే అప్పుడు సెంచరీ చేస్తారు అని అందరూ భావించారు. కాని ఆ తర్వాత టీం మొత్తం ఆల్ అవుట్ అయింది. టీం ఇండియాకు పోరాడి గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. కాని సెంచరీ చేయలేకపోయాడు. ఇప్పుడు అహ్మదాబాద్ లో జరుగుతున్న చివరి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా చక్కనైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు.

174 బంతుల్లో 96 పరుగులు చేసాడు. పది ఫోర్లు ఒక సిక్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే అక్షర పటేల్ అవుట్ అయిన తర్వాత ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్ డకౌట్ అయ్యారు. దీనితో మరోసారి సెంచరీ మిస్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో పంత్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అక్షర్ పటేల్ 43 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో టీం ఇండియా 365 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top