You are here
Home > viral

చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ విమానంలో అత్య‌ధిక సంఖ్య‌లో ప్ర‌యాణికులు ప్ర‌యాణించారు ?

విమాన ప్ర‌యాణం బ‌స్సు ప్ర‌యాణంలా కాదు. అందులో రిజ‌ర్వ్‌డ్ సీట్లు ఉంటాయి. ప్ర‌యాణికులు ముందుగానే రిజ‌ర్వ్ చేసుకున్న ప్ర‌కారం త‌మ త‌మ సీట్ల‌లో కూర్చుని వెళ్తారు. అయితే మీకు తెలుసా ? గ‌తంలో ఓ విమానంలో ప్ర‌యాణికులు బ‌స్సుల్లోని ప్ర‌యాణికుల్లా వెళ్లారు. అవును.

1991లో ఇథియోపియా నుంచి ఓ కార్గో 747 విమానంలో సీట్లు లేకుండా అనేక మంది యూదుల‌ను త‌ర‌లించారు. విమానంలో 1086 మంది ఎక్కారు. మార్గ‌మ‌ధ్య‌లో ఇద్ద‌రు జ‌న్మించారు. అందువ‌ల్ల మొత్తం 1088 మంది ఒకే విమానంలో వెళ్లారు. సాధార‌ణంగా మ‌నం రైళ్ల‌లో, బ‌స్సుల్లో సీట్లు దొర‌క్క‌పోతే ఎలా వెళ్తామో వారు విమానంలో అలా వెళ్లారు.

కాగా ఆ కార్య‌క్ర‌మానికి ఆప‌రేషన్ సోలోమాన్ అనే పేరు పెట్టారు. మొత్తం 34 ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్‌ల ద్వారా యూదుల‌ను త‌ర‌లించారు. 14,325 మంది ఇథియోపియా యూదుల‌ను 36 గంట‌ల్లో ఇజ్రాయెల్‌కు త‌ర‌లించారు. అలా భారీ సంఖ్య‌లో ఒక్కో విమానంలో వారు వెళ్లారు. కానీ ఆ ఒక్క విమానంలో మాత్రం ఏకంగా 1086 మంది ప్ర‌యాణించ‌డం విశేషం.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top