You are here
Home > viral

అరేబియన్ గుర్రాల‌కు…… ఎందుకంత డిమాండ్!

గుర్ర‌పు స్వారీ అంటే కొంద‌రికి చాలా ఇష్టం ఉంటుంది. అందుకు గాను వారు ప్ర‌త్యేకంగా గుర్రాల‌ను పెంచుకుంటూ అప్పుడ‌ప్పుడు స‌ర‌దాగా స్వారీ చేస్తుంటారు. అయితే గుర్రాల జాతిలో అరేబియన్ జాతి ఒక‌టి. అరేబియ్ గుర్రాలు అంటే చాలా ఫేమ‌స్ అని అంద‌రికీ తెలుసు. అవి నిజానికి ఇత‌ర గుర్రాల‌తో పోలిస్తే చాలా ఎక్కువ ధ‌ర‌ను క‌లిగి ఉంటాయి. వాటి మెయింటెనెన్స్ కూడా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. అయిన‌ప్ప‌టికీ గుర్ర‌పు స్వారీ చేసే కొంద‌రు అరేబియ‌న్ గుర్రాల‌ను స్వారీ చేసేందుకు, వాటిని పెంచుకునేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు.

arabian horces

 

అయితే అరేబియన్ గుర్రాలు ప్ర‌పంచంలో అత్యంత మేలు జాతికి చెందిన గుర్రాల జాతుల్లో ఒక‌టిగా ఉన్నాయి. వీటిని అరేబియా ఎడారుల్లో బ్రీడింగ్ చేసి చాలా క‌ఠిన‌మైన శిక్షణ ఇచ్చేవార‌ట‌. అందుక‌నే అవి అంత దృఢ‌త్వాన్ని, శ‌క్తిని క‌లిగి ఉంటాయి. ఎంత సేపు ప‌రుగెత్తినా అవి అంత త్వ‌ర‌గా అల‌సిపోవు. అత్యంత బ‌లిష్టంగా, దృఢంగా అవి ఉంటాయి. అలాగే ఇత‌ర గుర్రాల క‌న్నా అందంగా ఉంటాయి. అవి వేగంగా ప‌రుగెత్త‌డ‌మే కాదు, ఎక్కువ సేపు అల‌సిపోకుండా ఉండ‌గ‌ల‌వు. ఎక్కువ ప‌నిచేయ‌గ‌ల‌వు. స‌రిగ్గా శిక్ష‌ణ ఇవ్వాలేగానీ ఓన‌ర్ల‌కు చ‌క్క‌ని స్నేహితుల్లా మెలుగుతాయి. వాటిని సుల‌భంగా మచ్చిక చేసుకుని పెంచ‌వచ్చు.

ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి క‌నుకనే అరేబియ‌న్ జాతికి చెందిన గుర్రాలు అత్యుత్తమ గుర్రాలుగా ఉన్నాయి. ఇక ఈ జాతికి చెందిన ఒక్కో గుర్రం ధ‌ర సుమారుగా రూ.3.50 ల‌క్ష‌ల నుంచి రూ.7 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. ఇక వీటి పెంప‌కానికి ఒక్కో గుర్రానికి నెల‌కు రూ.30 వేల వ‌ర‌కు అవుతుంద‌ని స‌మాచారం. ఇంత ఖరీదు ఉన్న‌ప్ప‌టికీ వీటి ప్ర‌త్యేక‌తలు ఆక‌ట్టుకుంటాయి. కనుక‌నే ఈ జాతి గుర్రాల‌కు మార్కెట్‌లో స‌హ‌జంగానే డిమాండ్ ఏర్ప‌డింది.

 

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top